ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలి
29-07-2026 12:00 AM
పెబ్బేరు, జూలై 28: ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు వరికి బదులుగా తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు.
పెబ్బేరు మండలం శాఖాపూర్ (వై) రైతు వేదికలో నిర్వహించిన రైతు నేస్తం 100వ ఎపిసోడ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కందులు, మినుములు, వేరుశెనగ, ఉద్యాన పంటలు, చిరుధాన్యాల సాగుపై దృష్టి పెట్టాలని రైతులకు సూచించారు. ఈ సందర్భంగా మినుముల విత్తనాలను పంపిణీ చేసి, ఉత్తమ రైతులు, వ్యవసాయ అధికారులను సత్కరించారు. అనంతరం పాతపల్లి గ్రామంలోని డబుల్ బెడ్రూం గృహాల నిర్మాణ పనులను పరిశీలించి, నాణ్యతతో పాటు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.






