10 July, 2026 | 1:52 AM

ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి యూనియన్ ఏబీవీపీ

10-07-2026 12:00 AM

రాష్ట్ర అధ్యక్షులు డా రావుల కృష్ణ      

కరీంనగర్ క్రైం, జూలై9 (విజయక్రాంతి): అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ విద్యార్థి దినోత్సవం, 78వ ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా స్థానిక కోర్ట్ చౌరస్తా నుంచి గీత భవన్ వరకు వందలాది మంది విద్యార్థులు, కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించి, ఏబీవీపీ జెండాను ఆవిష్కరించారు.

ర్యాలీలో దేశభక్తి నినాదాలు, విద్యార్థి చైతన్యాన్ని ప్రతిబింబించే నినాదాలతో కరీంనగర్ పట్టణం మార్మోగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షులు డా. రావుల కృష్ణ  మాట్లాడుతూ 1949 జూలై 9న ఆవిర్భవించిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థగా ఎదిగి దేశవ్యాప్తంగా కోట్లాది మంది విద్యార్థులను చైతన్యవంతం చేస్తోందన్నారు.

విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు, నాణ్యమైన విద్య, పారదర్శక విద్యా విధానం, అవినీతి నిర్మూలన, క్యాంపస్ అభివృ ద్ధి వంటి అంశాలపై ఏబీవీపీ అనేక ఉద్యమాలు చేపట్టిందన్నారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు, నగర కార్యదర్శి యోగేష్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళి,గరల్స్ కన్వీనర్ నిత్య, జోనల్ ఇంచార్జిలు ఆకాష్, ప్రశాంత్, కార్యకర్తలు శివ, నవీన్, యశ్వంత్, కావ్య విద్యార్థులు మరి యు తదితరులు పాల్గొనారు.