ఎస్‌ఐఆర్‌పై రాజకీయ పార్టీలతో ప్రత్యేక సమావేశం
బడంగ్‌పేట్, జూలై 9 (విజయక్రాంతి): భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా బడంగ్పేట్ సర్కిల్ కార్యాలయంలో గురువారం కీలక సమావేశం జరిగింది. డిప్యూటీ కమిషనర్/ ఏఈఆర్‌ఓ వి.సమ్మయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమన్వయ సమా వేశానికి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధు లు, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ వి.సమ్మ య్య మాట్లాడుతూ.. సర్కిల్ పరిధిలోని ఓటర్ల సౌకర్యార్థం పోలింగ్ బూత్ల వారీగా హెల్ప్డెస్క్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఓటర్లు తమ సందేహాలను నివృ త్తి చేసుకోవడంతోపాటు ఎన్యూమరేషన్ ఫారాలను పూరించడానికి ఈ కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఓట ర్లు తమ ఎన్యూమరేషన్ ఫారంతో పాటు ఒక కలర్ పాస్ పోర్ట్ సైజ్ ఫోటోను తీసుకువస్తే, అక్కడికక్కడే వివరాలను నమోదు చేసుకునేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
ఈ కేంద్రాల వద్ద ఓటర్లకు సహాయం చేయడానికి అధికారులు, సర్కిల్ సిబ్బంది, వాలం టీర్లు నిరంతరం అందుబాటులో ఉంటారన్నారు. రాజకీయ పార్టీలు, ప్రజలు భాగస్వా ములు కావడంతో పాటు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో రాజకీయ పార్టీల పాత్ర కీలకమని డిప్యూటీ కమిషనర్ పేర్కొన్నారు. ప్రతినిధులు తమ పరిధిలోని ఓటర్లకు ఎస్‌ఐఆర్ ప్రాముఖ్యతను వివరించి, అర్హులైన ప్రతి ఒక్కరూ సకాలంలో ఎన్యూమరేషన్ ఫారాలను సమర్పించేలా అవగాహన కల్పించాలని కోరారు.
సమావేశంలో భాగంగా ఎస్‌ఐఆర్ అమలుపై రాజకీయ పార్టీల ప్రతినిధులు లేవనెత్తిన పలు సందేహాలను, సూ చనలను డిప్యూటీ కమిషనర్ నివృత్తి చేశా రు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయ డం కోసం ఎన్నికల సిబ్బంది, బూత్ లెవల్ అధికారులు బిఎల్‌ఓ, రాజకీయ పార్టీలు, ప్రజలు సమన్వయంతో ముందుకు సాగాలని ఆయన పిలుపు నిచ్చారు. సమావేశం లో సంబంధిత ఎన్నికల అధికారులు, సర్కిల్ సిబ్బంది, వివిధ రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.






