12 July, 2026 | 4:09 PM

Breaking News

షాబాద్ సైకో కిల్లర్ కోసం పోలీసుల వేట   •   విశాఖలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు   •   సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు లేఖ   •   ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •  

ఏసీబీకి చిక్కిన ఏవో, కాంట్రాక్టు ఉద్యోగి

27-06-2025 01:22 AM

ఆదిలాబాద్, జూన్ 26 (విజయక్రాంతి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏసీబీ అధికారుల దాడులతో అవినీతి అధికారుల బాగోతం బట్టబయలు అవుతున్నాయి. ఇప్పటికే పలువురు అవినీతి అధికారులు ఏసీబీ కి చిక్కగా, తాజాగా ఆదిలాబాద్ మున్సిపల్ అకౌంట్స్ ఆఫీసర్, కాంట్రాక్టు ఉద్యోగి పట్టుబడ్డారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీ కార్యాల యంలో గురువారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.

ఈ దాడుల్లో కాం ట్రాక్టర్ సంతోష్ వద్ద నుంచి మున్సిపల్ అకౌంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏవో) బట్టల రాజ్ కుమార్ గౌడ్, ఔట్సోర్సింగ్ ఉద్యోగి కంప్యూటర్ ఆపరేటర్ కొండ్ర రవికుమార్ ద్వారా రూ.15 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.కాంట్రాక్టర్ చేసిన పనులబిల్లుల కోసం రూ.20 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దింతో రూ.15 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఐతే బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దింతో బాధితుడు రూ.15 వేలు కంప్యూటర్ ఆపరేటర్ సహకారం ద్వారా మున్సిపల్ అకౌంట్ సెక్ష న్ కార్యాలయంలో మున్సిపల్ ఏవోకు లం చం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పట్టుబడిన ఇద్దరిని కరీంనగర్ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు ఏసీబీ డీఎస్పీ జి.మధు తెలిపారు.