17 April, 2026 | 3:07 PM

పాలిసెట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రారంభం

27-06-2025 01:21 AM

బెల్లంపల్లి అర్బన్ జూన్ 26: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్ కౌన్సెలింగ్ సర్టిఫికేట్ ధృవీకరణ ప్రక్రియ చేపట్టారు.గురువారం పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రారంభమైంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా డిస్ట్రిక్ట్ మొబైల్ సైన్స్ ఫేర్ ఆఫీసర్ (డీఎస్‌ఓ) కె. మధుకర్ ముఖ్య అతిథిగా హాజరై, మొదటి ధృవీకరణ ఫారాన్ని విద్యార్థికి అందజేశారు.

ఆయన సేవలను గుర్తిస్తూ, పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ డా. ఎం. దేవేందర్  ఆధ్వర్యంలో కళాశాల సిబ్బంది మధుకర్ ని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో  ఈఐ శాఖ హెడ్ బీ వెంకటేశ్వర్లు, ఈఈఈ శాఖ హెడ్ ఎస్ నాగరాజు, వర్క్‌షాపు సూపరింటెండెంట్  డీ రాందాస్, కౌన్సెలింగ్ ఇంచార్జి టీ. మధుకర్  ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు.