28 June, 2026 | 6:00 AM

ఏసీబీకి చిక్కిన అవినీతి చేప

03-02-2026 12:05 AM

లంచం తీసుకుంటూ దొరికిన ఆర్‌ఐ

నల్లగొండ క్రైం, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): రైతు భూమిని రికార్డుల్లో, ఆన్‌లైన్ లో నమోదు చేసేందుకు రూ.20 వేల     లంచం తీసుకూంటూ నల్లగొండ జిల్లా గు ర్రంపొడు తహసీల్దార్ కార్యాలయ ఆర్‌ఐ మ హమ్మద్ ఏసీబీకి చిక్కాడు. ఎకరం 15 గం టల భూమిని తన పేరున చేర్చి, రికార్డులో నమోదు చేసి 1బి లో చేర్చాలని ఓ రైతు ఆర్‌ఐ మహమ్మద్‌ను సంప్రదించారు. అం దుకు ఆర్‌ఐ రూ.20 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఏసీబీని ఆశ్రయించిన రైతు.. వారి సూచనతో సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో ఆర్‌ఐకు రూ. 20 వేలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని ఏసీబీ డీఎస్పీ జగదీష్ చందన్ తెలిపారు.