calender_icon.png 3 February, 2026 | 1:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాలిసెట్‌కు నోటిఫికేషన్ విడుదల

03-02-2026 12:06:46 AM

  1. మే 13న పరీక్ష నిర్వహణ 

తొలి రోజే ఓపెన్ కాని వెబ్‌సైట్

తలెత్తిన సాంకేతిక సమస్యలు 

హైదరాబాద్, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): డిప్లొమా ఇంజినీరింగ్, నాన్ ఇంజి నీరింగ్ కోర్సుల్లో ప్రవేశం పొందేందుకు నిర్వహించే పాలిసెట్ పరీక్ష మే 13న నిర్వహించనున్నారు. పాలిసెట్ నోటిఫికేషన్‌ను అధికారులు సోమవారం విడుదల చేశారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సోమవా రం నుంచే ప్రారంభించగా, తొలిరోజే వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు తెలిసింది.

వెబ్‌సైట్ ఓపెన్ కాకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందారు. దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 20. రూ.100 లేట్ ఫీజుతో ఏప్రిల్ 21 వరకు, తత్కాల్ ఫీజు రూ.300తో ఏప్రిల్ 22 వరకు గడువుంది. ఫలితాలను పరీక్ష నిర్వహించిన 12 రోజులు తర్వాత వెల్లడించనున్నారు.