3 April, 2026 | 3:42 AM

ప్రధానితో బండి సంజయ్ భేటీ

03-04-2026 02:02 AM

కరీంనగర్ కార్పొరేషన్‌ను బీజేపీ కైవసం చేసుకోవడం పట్ల మోదీ సంతోషం

హైదరాబాద్, ఏప్రిల్ 2(విజయక్రాంతి): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గురువారం ప్రధానమంత్రి నరేంద్రమోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌ను బీజేపీ కైవసం చేసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా వీరి మధ్య ప్రస్తావనకు రాగా ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు.

మున్సిపల్ ఎన్నికల్లో కేంద్ర నిధులు, అభివృద్ధి నినాదంతోనే ప్రజల్లోకి వెళ్లామని విషయాన్ని ఈ సందర్భంగా బండి సంజయ్ మోదీ దృష్టికి తీసుకొచ్చారు. దీంతోపాటు ‘మోదీ గిఫ్ట్’ పేరుతో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ స్కూళ్లలో టెన్త్ విద్యార్ధులందరికీ ఉచితంగా బ్రాండెడ్ సైకిళ్లను అందించిన అంశాన్ని ప్రస్తావించారు. కొత్తగా గెలిచిన కరీంనగర్ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధుల పక్షాన ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా ప్రధాని ‘ప్రజలకు నిరంతరం సేవ చేయడంలోనే తృప్తి ఉంటుంది. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు కృషి చేయండి. అట్టడుగు వర్గాల ప్రజలకు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంలో నిర్విరామంగా పనిచేయండి’ అని సూచించారు.