ఆర్టీఏ ఆఫీసుల్లో ఏసీబీ దాడులు
- ప్రైవేట్ వ్యక్తులను విచారించిన అధికారులు
- నాగోల్ కార్యాలయంలో ౧౨ మంది ఏజెంట్లు అదుపులో
శేరిలింగంపల్లి/ నాగోల్/మేడ్చల్, మే 27 (విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా పలు ఆర్టీవో కార్యాలయాల్లో బుధవారం ఏసీబీ అధికారులు ఏకకాలంలో ఆకస్మిక దాడులు నిర్వ హించారు. ఆర్టీవో కార్యాలయాల్లో పనిచేస్తు న్న కొంతమంది సిబ్బందిపై అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ ఈ దాడులు చేపట్టిన ట్లు సమాచారం. కొండాపూర్, నాగోల్, మే డ్చల్, ఉప్పల్ ఆర్టీవో కార్యాలయాల్లో ఒకేసారి మెరుపు దాడులు నిర్వహించారు. ఆయా కార్యాలయాల్లోని పెండింగ్ ఫైళ్లు, డ్రైవింగ్ లైసెన్స్‌లు, వాహనాల రిజిస్ట్రేషన్లలో అక్రమాలపై అధికారులు విచారణ చేపట్టారు.
ఆర్టీఏ ఏజెం ట్లు తదితరులను విచారిస్తున్నారు. ఏజెంట్ల ద్వారా డ్రైవింగ్ లైసెన్స్లు, ఇతర రిజిస్ట్రేషన్ పనులు అక్రమంగా జరుగుతున్నాయనే స మాచారంతో సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కొండాపూర్ ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్టీఏ)లో ఇద్దరు ఏసీబీడీఎస్పీలు మాజిద్ అలీఖాన్, చలపతిరావు నేతృ త్వంలో నలుగురు ఇన్స్‌పెక్టర్లతో కూడిన ప్రత్యే క బృందం దాడుల్లో పాల్గొంది.నాగోల్‌ఆర్టీఏ కార్యాలయంలో హైదరాబాద్ రేంజ్-2 ఏసీబీ డీసీపీ గంగసాని శ్రీధర్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. డ్రైవింగ్ లైసెన్సుల జారీ ప్రక్రియలో నిబంధనలకు విరుద్ధంగా ఏజెంట్ల జోక్యం కొనసాగుతున్నట్లు అధికారులు గుర్తించారు.
సోదాల సమయంలో కార్యాలయం లోపల అనుమతి లేకుండా సంచరిస్తున్న సుమారు 12 మంది ఏజెంట్లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ శ్రీధర్ స్పష్టం చేశారు. మేడ్చల్‌లోని ఆర్టీఏ కా ర్యాలయంలో ఏసీబీ డీఎస్పీ లక్ష్మీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. అక్రమంగా పత్రాలు కలిగి ఉన్న ప్రైవేటు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించారు. ఏజెంట్ల మొబైల్ ఫోన్‌లో కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్ పరిశీలించారు.






