ఉద్యోగుల బదిలీల్లో గందరగోళం
హైదరాబాద్, మే 27 (విజయక్రాంతి): ఉద్యోగుల బదిలీల్లో అంతా గందరగోళం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం పలు అయితే బదిలీ నిబంధనలను అధికారులు తుంగలో తొక్కుతున్నారని తెలంగాణ ఉద్యోగుల జేఏ సీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు బుధవారం తెలంగాణ ఉద్యోగుల జేఏసీ అధ్యక్షు డు మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్ రావు ఒక ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను బదిలీ చేయడానికి ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను కొంత మంది ఉన్నతాధికారులు తమ ఇష్టారీతిన వ్యవహరిస్తుం డటాన్ని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ తీవ్రంగా నిరసిస్తోందన్నారు. జీవో నెం.38 ద్వారా ప్రభుత్వం బది లీలను ఎలా చేయాలో మార్గదర్శ కాలు వి డుదల చేయడం జరిగిందని, అయితే కొన్ని శాఖల్లో ఉన్నతాధికారులు తమకు తోచినట్లు వ్యవహరిస్తున్నారని, దీంతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని తెలిపారు.






