calender_icon.png 29 January, 2026 | 12:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీ వలలో మరో అవినీతి చేప

25-07-2024 03:14:51 PM

హనుమకొండ:  రాష్ట్రవ్యాప్తంగా ఓ పక్కన ఏసీబీ సోదాలు జరుగుతున్నప్పటికి అధికారులు మాత్రం లంచాలకు చేతులు సాపుతున్నారు. తాజాగా హనుమకొండలో ఓ అవినీతి అధికారిని ఏసీబీ వలకు చిక్కింది. పరకాల సబ్ రిజిస్ట్రార్ సునీత రూ.80 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. వారసత్వ భూములు రిజిస్ట్రేషన్ చేసేందుకు సబ్ రిజిస్ట్రార్ లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పక్క పతకంతో సబ్ రిజస్ట్రార్ సునీత లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకుని, పరకాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సోదాలు జరిపి విచారణ చేశారు.