29-01-2026 12:04:55 PM
సంస్థాన్ నారాయణపూర్,(విజయ క్రాంతి): సంస్థాన్ నారాయణపూర్ మండలం గంగమూల తండాలో మద్యం నియంత్రణపై అవగాహన ర్యాలీ సర్పంచ్ కరంటోత్ లచ్చు నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేపట్టిన మహా యజ్ఞానికి తామంతా సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఆయన కోరుకున్న మధ్యరహిత గ్రామంలో గంగమూల తండా మొదటి స్థానంలో ఉంటుందని తెలిపారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komati Reddy Rajagopal Reddy) తీసుకున్న నిర్ణయం అందరి ఆరోగ్యం కోసం తీసుకున్నాడని దానికి అందరం కట్టుబడి ఉండాలని కోరారు.యువత మద్యానికి అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తద్వారా వారి కుటుంబాలు రోడ్డున పడి చిద్రమై పోతున్నాయని అందుకే వారి జీవితాలను బాగుచేయాలనే సదుద్దేశంతో మద్యం నియంత్రణ చేపట్టారని అన్నారు.గ్రామస్తులంతా సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో యువత,మహిళలు పాల్గొన్నారు.