29-01-2026 10:45:44 AM
అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను చంపిన భార్య
మృతుడి మేనల్లుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య
మృతుడు పలుమార్లు హెచ్చరించడంతో హతమార్చిన ఘటన
పరారీలో భార్య మృతుడి మేనల్లుడు
మాడుగులపల్లి, (విజయక్రాంతి): ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తనే కాటికి పంపిన ఘటన మాడుగుల పల్లి మండలంలో చోటు చేసుకుంది.స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని,సీత్యా తండాకు చెందిన (మృతుడు )రమావత్ రవి నాయక్ (34) ను,భార్య రమావత్ లక్ష్మి,మంగళవారం రాత్రి,ఇతర వ్యక్తులతో కలసి హతమార్చినట్లు తెలిపారు. మృతుడి మేనల్లుడుతో గత నాలుగేళ్ల నుండి అక్రమ సంబంధం పెట్టుకోవడంతో రవి పలుమార్లు హెచ్చరించడంతో కోపం పెంచుకొని ఇంట్లో ఎవరూ లేని సమయంలో రవిని భార్య, భార్య ప్రియుడు కలిసి హత్య చేసి ఉండొచ్చని పోలీసులు తెలిపారు. మృతుడి రవి భార్య, మేనల్లుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. మృతుడు తండ్రి లక్ష్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణయ్య తెలిపారు. మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రి కీ తరలించినట్లు తెలిపారు.