calender_icon.png 29 January, 2026 | 5:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరో సంచలనం

29-01-2026 12:23:01 PM

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసును(Phone Tapping Case) దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (Special Investigation Team) ఈ కేసు విషయంలో విచారణకు హాజరు కావాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (Kalvakuntla Chandrashekar Rao)కు గురువారం నోటీసు జారీ చేసేందుకు బయలుదేరారు.

ట్యాపింగ్ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు ఇప్పటికే సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. వారిని సిట్ అధికారులు ఏడు గంటలకు పైగా విచారించారు. ఈ కేసులోనే కేసీఆర్ మేనల్లుడు జోగినపల్లి సంతోష్ రావు కూడా సిట్ ముందు హాజరయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కింద అప్పటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (SIB) అధికారులు రాజకీయ నాయకులు, ప్రముఖులు, టాలీవుడ్ నటులు, జర్నలిస్టులు, న్యాయమూర్తుల మొబైల్ ఫోన్‌లను ట్యాప్ చేశారు.

సిట్ నోటీసుల నేపథ్యంలో కేటీఆర్, హరీశ్ రావు సహా ముఖ్యనేతలు ఫామ్ హౌస్ కి పయనం కానున్నారు. నోటీసులిస్తే ఎలా స్పందించాలనే దానిపై లీగల్ టీమ్ తో మాట్లాడే అవకాశముంది. విచారణకు హాజరవుతారా? న్యాయపరంగా ఆప్షన్లు పరిశీలిస్తారా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. జూబ్లీహిల్స్ పీఎస్ లోనే సిట్ చీఫ్ సజ్జనార్ కేసీఆర్ ను విచారించే అవకాశముంది. రేపు ఉదయం 11 గంటలకు కేసీఆర్ ను విచారించే అవకాశముందని వర్గాలు వెల్లడించాయి. కేసీఆర్ కి నోటీసులు ఇస్తారని ముందే ఊషించామని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. కేసీఆర్ ప్రస్తుతం ఎర్రవల్లి నివాసంలోనే ఉన్నారు.