ఆమోదమా? వెనక్కా?
- రాజ్‌భవన్‌కు చేరిన ఐదు బిల్లులు!
- న్యాయ సలహా కోసం గవర్నర్ సిఫారసు
హైదరాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): తెలంగాణ శాసనసభ సమావేశాలు వాడీవేడిగా కొనసా గాయి. ప్రధానంగా కాళేశ్వరం నివేదికపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగిన విషయం తెలిసిందే. శానసమండలితో పాటు శాసనసభలో ప్రభుత్వం మొత్తం ఐదు బిల్లులను ప్రవేశపెట్టింది. బీసీలకు స్థానిక సంస్థల్లో ఉన్న 50 శాతం నిబంధన ఎత్తివేస్తూ.. రిజర్వేషన్లను పెంచుతూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్ సవరణ బిల్లు ఏకగ్రీవ ఆమోదం పొందింది.
పురపాలక చట్ట సవరణ బిల్లుకు కూడా రెండు సభలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. ఇక అల్లొపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్‌మెంట్ బిల్లుకు, సంగారెడ్డి జిల్లాలో ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీల ఏర్పాటు, ఇస్నాపూర్ మున్సిపాలిటీ విస్తరణ చేస్తూ మంత్రి సీతక్క ప్రవేశపెట్టి బిల్లులకు ఉభయ సభలో ఆమోదం లభించింది.
అయితే ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా అసెంబ్లీతో పాటు మండలిలో ఆమోదించిన మొత్తం ఆ ఐదు బిల్లులు రాజ్‌భవన్‌కు మంగళవారం చేరాయి. అయితే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వాటిని ఆమోదించే ముందు న్యాయ సలహా తీసుకోవాలని నిర్ణయించినట్లుగా సమాచారం. గవర్నర్ ఐదు బిల్లులకు ఆమోదం తెలుపుతారా లేక తిరిగి వెనక్కి పంపుతారా అని ప్రభుత్వ వర్గాల్లో ఉత్కంఠగా మారింది.






