11 August, 2026 | 7:58 PM

పెద్దచెల్మెడ-ఖ‌మ్మంప‌ల్లి రోడ్డుకు రూ.8.50 కోట్లు మంజూరు

11-08-2026 06:56 PM

రోడ్డు విస్త‌ర‌ణ కోసం స‌ర్వే చేప‌ట్టిన అధికారులు

మునిప‌ల్లి,(విజయక్రాంతి): మండ‌ల ప‌రిధిలోని పెద్ద‌చెల్మెడ నుంచి ఖ‌మ్మంప‌ల్లి  గ్రామం వ‌ర‌కు డ‌బుల్ రోడ్డు కోసం రూ. 8.50కోట్ల నిధుల‌ను ఇటీవ‌ల ప్ర‌భుత్వం మంజూరు చేసిన విష‌యం అంద‌రికి  తెలిసిందే. రోడ్డు నిర్మాణానికి అంచనా (ఎస్టిమేట్) తయారు చేసేందుకు 5 కిలోమీట‌ర్ల‌కు సంబంధించి మంగ‌ళ‌వారం ఎస్ఈ జ‌గదీశ్వ‌ర్, డీఈ క్రిష్ణ త‌దిత‌రులు సర్వే నిర్వహించారు.  భూసేకరణలో భాగంగా ఈ సర్వే ద్వారా రోడ్డు మార్గం సరిహద్దులు, భూమి యజమానుల వివరాలు,  సాంకేతిక అంశాలను పరిశీలించారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ మండ‌ల అధ్య‌క్షుడు స‌తీష్ కుమార్, మాజీ ఎంపీపీ రాంరెడ్డి, ఏఈ మౌనిష్, సర్పంచ్ గుజారి పాండు,నాయ‌కులు సంగ‌న్న, గుడ్డు ప‌టేల్ ఫెరోజ్ఖాన్,త‌దిత‌రులు ఉన్నారు.