కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయంలో టెండర్ల స్వీకరణ
16-08-2026 08:43 PM
ఎల్బీనగర్, ఆగస్టు 16: ప్రసిద్ధ కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయంలో వివిధ పనుల నిర్వాహణకు ఆసక్తి ఉన్నవారి నుంచి టెండర్ల దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆలయ ఈవో లావణ్య ఒక ప్రకటనలో తెలిపారు.
ఆలయంలో ఒక సంవత్సర కాలపరిమితి (11-11-2026 నుంచి 10-11-2027) వరకు దేవాలయంలో వివిధ పనుల హక్కుల కోసం సీల్స్ టెండర్-కమ్-బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వాహనముల పార్కింగ్ నిర్వహణ, కొబ్బరి చిప్పల సేకరణ, అమ్మవారి చీరలు స్వీకరణకు ఈ నెల 24 నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. పూర్తి వివరాలకు దేవాలయ పని వేళల్లో కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.






