17 April, 2026 | 3:24 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

సహాయ ఉపకరణాల కొరకు దరఖాస్తుల స్వీకరణ

15-06-2025 12:17 AM

జిల్లా సంక్షేమాధికారి రౌఫ్ ఖాన్..

మంచిర్యాల (విజయక్రాంతి): అర్హులైన దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు కొరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా మహిళ, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ అధికారి రౌఫఖాన్(District Welfare Officer Rauf Khan) తెలిపారు.

ప్రభుత్వం దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్ల సంక్షేమ శాఖ, తెలంగాణ వికలాంగుల సహాయక సమితి ద్వారా జిల్లాలోని ప్రతి దివ్యాంగుడికి సహాయ ఉపకరణాలు పంపిణీ చేయడం జరుగుతుందని, జిల్లాకు 45 రెట్రోఫిట్మెంట్ స్కూటీలు, 14 బ్యాటరీ వీల్ చైర్స్, 18 మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రై సైకిళ్లు, 1 బ్యాటరీ మినీ ట్రేడింగ్ ఆటో వెహికల్, 5 హైబ్రిడ్ వీల్ చైర్లు, 14 ల్యాప్ టాప్స్ (డిగ్రీ విద్యార్థులకు), 7 ల్యాప్టాప్స్ (ఉన్నత సాంకేతిక విద్య), 22 టాబ్స్, 25జి స్మార్ట్ ఫోన్, 11 చేతి కర్రలు, 3 వీల్ చైర్లు, 1 చెవిటి మిషన్, 6 ట్రై సైకిల్లు, 6 వీల్ చైర్స్, 23 క్రచెస్, 2 చెవిటి మిషన్లు, 23 వాకింగ్ స్టిక్స్, 11 స్మార్ట్ కేన్స్, 11 ఎం. సి. ఆర్. చెప్పల్ మంజూరయ్యాయని తెలిపారు.

అర్హత కలిగిన వికలాంగులు ఆన్ లైన్ లో https://tgobmms.cgg gov.in లో ఈ నెల 18లోగా పూర్తి వివరాలతో జాగ్రత్తగా దరఖాస్తు చేసుకోవాలని, ఇతర వివరాలకు హెల్ప్ లైన్ నం. 155326 లో సంప్రదించాలని, అర్హత గల దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.