17 April, 2026 | 4:55 PM

గద్దర్ ఫౌండేషన్‌కు 3 కోట్లు మంజూరు

15-06-2025 12:17 AM

- గద్దర్ జయంతి వేడుకల్లో ఫౌండేషన్‌కు భాగస్వామ్యం

- తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

హైదరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): ప్రజాయుద్ధ నౌక గద్దర్ ఆలోచనలు, ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు గానూ సికింద్రాబాద్‌లోని గద్దర్ ఫౌండేషన్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.3 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్ పాలనాపరమైన అనుమతులకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఫౌండేషన్‌కు అవసరమైన నిధులు కేటాయిస్తామని గతంలో జరిగిన గద్దర్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ హామీ ఇచ్చారు.

తాజాగా ఆ మాటను నిలబెట్టుకున్నారు. ఏటా జనవరి 31న నిర్వహించే గద్దర్ జయంతి, సంక్షేమ కార్యక్రమాలకు ఈ నిధులను వినియోగించనున్నారు. తెలంగాణ ఉద్యమం, సాంస్కృ తిక రంగంపై తనదైన ముద్ర వేసిన గద్దర్ సేవలకు గుర్తింపుగా ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోం ది. ఇక ముందు గద్దర్ జయంతి వేడుకల కార్యక్రమాల నిర్వహణలోనూ గద్దర్ ఫౌండేషన్‌కు భాగస్వామ్యం కల్పిస్తూ మరో ఉత్తర్వును ప్రభుత్వం జారీ చేసింది.