15 April, 2026 | 6:22 AM

ఎస్‌హెచ్‌జీ మహిళలకు ప్రమాదబీమా

23-06-2025 12:58 AM

- ప్రతీ మహిళకు రూ.10లక్షలు..

- రూ.70కోట్ల స్త్రీ నిధి సహకారం సంఘం నిధులతో అమలు

- తిరిగి ‘స్త్రీ నిధి’కి చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం

హైదరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్వయంసహాయక సం ఘం మహిళలకు ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తున్నది. ఈ పథకంలో భాగంగా ఎస్‌హెచ్‌జీలో ప్రతి మహిళకూ రూ.10లక్షల బీమా వర్తిస్తుంది. ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రమాద బీమా పథకం ద్వారా రాష్ట్రంలోని 64.35లక్షల మంది మహిళలు లబ్ధి పొందుతున్నారు.

అయితే ఈ పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ నిధి సహకార సంఘం నుంచి ప్రభుత్వం రూ. 70 కోట్ల నిధులను చేబదులుగా తీసుకున్నది. ఈ నేపథ్యంలో స్త్రీ నిధి సహకారం సంఘం నుంచి తీసుకున్న నిధులను తిరిగి చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.

ఇటీవల జరిగిన మంత్రుల సమావేశంలోనూ ఈ అంశంపై చర్చించారు. ఈ క్రమంలో త్వరలోనే స్త్రీ నిధి సహకారం సంఘానికి రూ.70కోట్ల నిధులు మంజూరు కానున్నట్టు అధికారులు చెబుతున్నారు.