పెద్ద అంబర్‌పేట్ ఓఆర్‌ఆర్‌పై ప్రమాదం
- అక్కడిక్కడే ఒకరు
చికిత్స పొందుతూ మరొకరు మృతి
అబ్దుల్లాపూర్‌మెట్, ఏప్రిల్ : నగర శివారు పెద్ద అంబర్ పేట్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని.. ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే ఒకరు మృతి చెందగా.. చికిత్స పొందుతూ మరో బాలుడు మృతి చెందిన సంఘటన అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హనుమకొండకు చెందిన వేద ప్రకాష్ రెడ్డి (37) సాఫ్ట్ వేర్ ఇంజనీర్ బెంగళూరులో పనిచేస్తున్నాడు. భార్య ఇద్ద రు తన ఇద్దరు పిల్లలతో కలిసి వరుసగా సెలవులు రావడంతో రావడంతో కుటుంబ సభ్యులతో కలిసి హనుమకొండ కు వచ్చా రు.
సెలవులు ముగియడంతో వేద ప్రకాష్ రెడ్డి, తన భార్య హిమ బిందు, రెండున్నరేళ్ల కుమారుడు అర్జున్తో పాటు, అతని కజిన్ సోదరుడు దుర్గా ప్రసాద్ రెడ్డి, అతని భార్య శ్రీజతో కలిసి కేఏ 01 ఎంవీ 4094 గల వోక్స్వ్యాగన్ కారులో మంగళవారం బెంగళూరుకు బయలుదేరారు. మార్గ మధ్యలకు రాగానే పెద్ద అంబర్ పేట్ ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర వారు ప్రయాణిస్తున్న కారు పెద్ద అంబర్పేట్ నుంచి బొంగుళూరు టోల్ ప్లాజా వైపు గంటకు 101 కిలోమీటర్ల వేగంతో వెళుతుండగా,
ఏపీ 24 డబ్ల్యూ 2003 నంబరు గల నీటి ట్యాంకర్ను బలం గా ఢీకొట్టడంతో.. వేద ప్రకాష్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన వారిని డీఆర్డీఓ అపోలో దవాఖకు తరలించారు. చికిత్స పొందుతూ రెండున్నరేళ్ల అర్జున్ మృతి చెందాడు. మిగతావారు చికిత్స పొం దుతున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అబ్దుల్లాపూర్ మెట్ ఇన్ స్పెక్టర్ వి. అశోక్ రెడ్డి తెలిపారు.






