29 June, 2026 | 12:58 AM

జనగామ జిల్లాలో సీఐ, ఎస్‌ఐ సస్పెన్షన్

29-06-2026 12:09 AM
  1. ఆదేశాలు జారీ చేసిన వరంగల్ సీపీ
  2. కేసు విషయంలో అక్రమాలకు పాల్పడినట్టు ఫిర్యాదు               

జనగామ, జూన్ 28 (విజయక్రాంతి): జనగామ జిల్లా నర్మెట సీఐ అబ్బయ్య, ఏఆర్ అటాచ్‌లో ఉన్న ఎస్‌ఐ షేక్ హమీద్‌ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. బచ్చన్నపేటలో హమీద్ ఎస్‌ఐగా పనిచేస్తున్న సమయంలో ఓ కేసు విషయంలో సీఐ, ఎస్‌ఐలు అక్రమాలకు పాల్పడినట్టు ఫిర్యాదులు వచ్చాయి. విచారణ జరిపిన సీపీ ఎట్టకేలకు వీరిద్దరిపై వేటు వేస్తూ ఉత్తర్వు లు జారీ చేశారు. అధికారులు ఇద్దరూ ఒకే కేసులో సస్పెండ్ కావడం చర్చనీయాంశంగా మారింది.అయితే పోచన్నపేట గ్రామానికి చెందిన ఓ కేసు విషయంలో వీరిద్దరిపై వేటుపడినట్లు చర్చ జరుగుతుంది.