28 June, 2026 | 9:42 PM

విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు: మేయర్ జక్క

14-06-2024 12:10 AM

మేడిపల్లి సిటీబ్యూరో, జూన్ 13 (విజయక్రాంతి): విద్యార్థులు చదువులో ఉన్నతంగా రాణించాలని పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి అన్నారు. బడిబాట కార్యక్రమం లో భాగంగా గురువారం మేడిపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా చదువుకోవడానికి ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తోందన్నారు. డిజిటల్ తరగతులు, నాణ్యతతో కూడిన విద్యను అందు తోంది కాబట్టే గతంలో కంటే నేడు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయం గా పెరిగిందని తెలిపారు. విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అన్నారు. కార్పొరేటర్లు దొంతిరి హరిశంక ర్‌రెడ్డి, బచ్చ రాజు, మధుసూదర్ రెడ్డి, ఏంపల్ల అనంత్ రెడ్డి, బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఏడవల్లి రఘువర్ధన్ రెడ్డి, రఘుపతిరెడ్డి, జావీద్‌ఖాన్, హెచ్‌ఎం సత్యపాల్ పాల్గొన్నారు.