14 August, 2026 | 8:17 PM

Breaking News

వివాహ ఆహ్వాన పత్రిక అందజేత   •   స్మార్ట్ రేషన్ కార్డు లబ్ధిదారులను కార్యక్రమానికి తరలించాలి   •   60 ఏళ్లుగా జీవనాధారంగా ఉన్న మడిగపై వివాదం   •   పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయాన్ని పరిశీలించిన ఆర్డీవో   •   నేను ఎలాంటి అసైన్ భూమిని కబ్జా చేయలేదు   •   హనుమాన్ దేవాలయాన్ని అన్ని హంగులతో నిర్మిస్తాం   •   ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ఫోరం ఆసిఫాబాద్ మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఖర్గేకు సంఘీభావంగా ఆలేరులో కాంగ్రెస్ భారీ పాదయాత్ర, సత్యాగ్రహం   •   విద్యార్థులకు పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన   •   విద్యార్థులకు పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన   •  

అర్హులైన వారికి అక్రిడిటేషన్ కార్డులు: కలెక్టర్ ఆశీష్ సంగువాన్

25-04-2026 12:50 AM

కామారెడ్డి, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): అర్హులైన వారికి ఆకిరీడేషన్ కార్డులు అందే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ అన్నారు. నూతన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో శుక్రవారం సమావేశం కలెక్టర్ నిర్వహించారు. కలెక్టరేట్ మినీ సమావేశం  హాలు లో నూతన మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యులతో సమీక్ష  సమావేశం  లో జిల్లా కలెక్టర్  ఆశిష్ సాంగ్వాన్  పాల్గొని మాట్లాడుతూ అర్హులైన వారికి  అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయాలని అన్నారు, 252  జి ఓ  ననుసరించి నియమ నిబంధనలు తప్పకుండ పాటించాలని అన్నారు.

మీడియా ప్రతినిధులు ప్రజలకు ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను సరిగ్గా చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తారని  కమిటీ సభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించి మీడియా వ్యవస్థ పై ప్రజల నమ్మకాన్ని పెంపొందించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సమావేశంలో సభ్యులు తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేశారు. మీడియా రంగంలో మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని దృష్టిలో ఉంచుకొని అక్రిడిటేషన్ ప్రమాణాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు.

ఈ సమావేశం లో అదనపు కలెక్టర్ విక్టర్, dpro తిరుమల, కమిటీ సభ్యులుగా  వి. రజనీకాంత్, మంత్రి ఆంజనేయులు, వుక్కల్కర్ రాజేందర్నాథ్, వేణుగోపాల చారి, సయ్యద్ కౌసర్ అలీ,  వి. శశిధర్, షేక్ మొయినుద్దీన్, బొక్కల వేణు, గంట చంద్ర శేఖర్, మహమ్మద్ ఆబిద్ , తదితరులు పాల్గొన్నారు.