మాటలు కాదు.. శాశ్వత పరిష్కారం కావాలి
- ఆర్టీసీ కార్మికులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు
- శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నం బాధాకరం
- ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే ప్రభుత్వం స్పందించాలి
- ఎఐటియుసి అదనపు ప్రధాన కార్యదర్శి రంగయ్య
కొత్తగూడెం, ఏప్రిల్ 24, (విజయక్రాంతి): సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడటం అత్యంత బాధాకరం అని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం కొత్తగూడెం బస్టాండ్ ఎదుట రెండోవరోజు చేస్తున్న శాంతియుత ధర్నాలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన కోరికలు నెరవేర్చాలని గత రెండు రోజులుగా డిపో ఎదుట నిలబడి శాంతియుతంగా పోరాటం చేస్తున్నారని,వీరి పోరాటానికి మద్దతుగా సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి సమ్మెలో పాల్గొన్నారు.
సమ్మె చేస్తున్నటువంటి ఆర్టీసీ కార్మికులు మనోవేదనకు గురై మనస్తాపం చెందుతున్నారన్నారు.కాబట్టి ప్రభుత్వం ఆలోచించి త్వరితగతిన వారి యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. తెలంగాణలో గొప్ప పోరాటాలు చూసామని, తెలంగాణ సాయుధ పోరాటం ఒకటి పోరాటాలతో తెలంగాణ సాధించుకున్నదన్నారు. తిరిగి సమస్యలతో ఆత్మబలిదానాల కోసం కాదు అని పేర్కొన్నారు. కార్మిక సోదరులారా దయచేసి ఏ ఒక్కరు ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ 12 ఏరియాలో ఆర్టీసీ కార్మికులకు నిలుస్తామని, ప్రభుత్వం తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు.లేని పక్షంలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించి సమ్మెను ఉదృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమం లో కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్,సెంట్రల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి వీరస్వామి, బ్రాంచ్ కార్యదర్శి రమణమూర్తి,నాయకులు కత్తెర్ల రాములు,గాంధీ, మండల రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.






