4 April, 2026 | 7:12 PM

అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు టిప్పర్లు సీజ్

04-04-2026 05:39 PM

సత్తుపల్లి,(విజయక్రాంతి): ఏపీ నుంచి తెలంగాణలోకి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న మూడు ఇసుక లారీలను విశ్వసనీయ సమాచారం మేరకు సత్తుపల్లి మండలం నారాయణపురం గ్రామ శివారులో వరంగల్ యూనిట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అడ్డుకున్నారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న మూడు ఇసుక లారీలను విశ్వసనీయ సమాచారం మేరకు సత్తుపల్లి మండల నారాయణపురం గ్రామ శివారులో వరంగల్ యూనిట్ విజిలెన్స్ ఇన్ఫోర్స్మెంట్ అధికారులు అడ్డుకున్నారు.

సమాచారం మేరకు అధికారులు అకస్మికంగా తనిఖీ నిర్వహించగా సుమారు 100 మెట్రిక్ టన్నుల ఇసుకతో ఉన్న మూడు టిప్పర్లు స్వాధీనం చేసుకున్నారు విచారణలో డ్రైవర్లు ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల పరిధిలోని బేతుపల్లి గ్రామానికి చెందిన దొడ్డ శ్రీనివాసరావు. దొడ్డ ప్రవీణ్. ఈ అక్రమ ఇసుక స్మగ్లింగ్ కు పాల్పడిన ట్ విజిలెన్స్ అధికారులు వెల్లడించారు. గత ఆరు నెలలుగా ఈ ముఠా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలోని కొవ్వూరు ఇసుక ర్యాంపు నుంచి తెలంగాణ రాష్ట్రంసతుపల్లికి ఇసుక స్మగ్లింగ్ చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.