3 April, 2026 | 12:37 PM

లైంగిక దాడి కేసులో నిందితుల అరెస్ట్

07-11-2024 12:03 AM

కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలింపు

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 6 (విజయక్రాంతి): మధురా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఓ మహిళ (50)పై జరిగిన సామూహిక లైంగిక దాడి ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మధురా నగ ర్ పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

విశ్వసనీయ సమాచారం మేరకు గచ్చిబౌలి బయో డైవర్సిటీ వద్ద ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన నిందితులు చందు (25), అజయ్ (25), ఆరీఫ్ (35)ను బుధవారం అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు పంజాగుట్ట ఏసీపీ మోహన్‌కుమార్ తెలిపారు.