ఫ్లెఓవర్ పనులపై అధికారుల ఆగ్రహం
నత్తనడకన సాగడంపై కాంట్రాక్టర్‌ను హెచ్చరించిన ప్రాజెక్ట్ డైరెక్టర్ సి.ఎస్.రావు
బాలానగర్ : మండల రెండేళ్లుగా కొనసాగుతున్న ఫ్లైఓవర్ నిర్మాణ పనులను హైదరాబాద్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సి.ఎస్.రావు, డిప్యూటీ జనరల్ మేనేజర్ మీరా అనూష మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనులు నెమ్మదిగా సాగుతుండటంపై అధికారుల ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే దుమ్ము దులి తో ప్రజలకు చాలా ఇబ్బంది గా ఉన్న కూడా పట్టించు కొవట్లేదు. కాంట్రాక్టర్ సునీల్ జానదవ్‌ను పనుల జాప్యంపై నిలదీశారు. చిన్నచిన్న కారణాలతో పనులను ఆలస్యం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అవసరమైన సంఖ్యలో కూలీలను ఏర్పాటు చేసి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. నిర్మాణానికి అవసరమైన మెటీరియల్‌ను దూర ప్రాంతంలో నిల్వ చేయడం వల్ల పనుల్లో జాప్యం జరుగుతోందని అధికారులు గుర్తించారు. ఇకనైనా పనుల వేగం పెంచి నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సూచించారు. పనులు ఇదే విధంగా నెమ్మదిగా కొనసాగితే కఠిన చర్యలు తీసుకుంటామని కాంట్రాక్టర్‌ను హెచ్చరించారు. తనిఖీలో నేషనల్ హైవే అధికారులు పాల్గొన్నారు.






