12 August, 2026 | 10:31 AM

మూడు నెలలైనా కౌన్సిల్ సమావేశం లేదు

12-08-2026 09:38 AM

ముకరంపుర, ఆగస్టు 11 (విజయ క్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థలో గత మూడు నెలలుగా కౌన్సిల్ సమావేశాలు నిర్వహించకపోవడంపై కరీంనగర్ మాజీ మేయర్, 58వ డివిజన్ కార్పొరేటర్ , సర్దార్ రవీందర్ సింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.తెలంగాణ మున్సిపాలిటీల్లో పాలనా వ్యవహారాల నిర్వహణకు సంబంధించిన 2021 నిబంధనల ప్రకారం కనీసం ప్రతి నెలా ఒకసారి కౌన్సిల్ సమావేశం నిర్వహించి ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, మున్సిపల్ వ్యవహారాలపై చర్చించాల్సి ఉందని సర్దార్ రవీందర్ సింగ్ పేర్కొన్నారు.ప్రజల సమస్యలు, డివిజన్ల అభివృద్ధి, మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు తదితర అంశాలపై ప్రజాప్రతినిధులు కౌన్సిల్‌లో చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని సర్దార్ రవీందర్ సింగ్ అన్నారు.