3 April, 2026 | 2:50 PM

Breaking News

ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలపై దాడి చేస్తాం: ట్రంప్ బెదిరింపులు   •   TRS పేరుతో కవిత పార్టీ..! పాత పేరు.. కొత్త అజెండాతో ప్రజల ముందుకు   •   మంగళపల్లిలో ‘నత్తనడక’న అభివృద్ధి పనులు   •   మహంకాళి అమ్మవారికి ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రత్యేక పూజలు   •   ఘనంగా దొడ్డి కొమురయ్య 99వ జయంతి వేడుకలు   •   రైలు ఢీకొని గుర్తు తెలియని వృద్ధురాలు మృతి   •   కొండాపూర్‌లో డ్రగ్స్ కలకలం.. పబ్‌లో సినీనటి హేమ   •   బైక్‌పై ట్రిపుల్ రైడింగ్ — అమ్మవారి జాతరకు వెళ్లొస్తూ ముగ్గురు దుర్మరణం   •   తూప్రాన్‌లో శ్రీరాముడి రథోత్సవం.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య వివాదం   •   దొడ్డి కొమరయ్య... నేటి ప్రజావ్యతిరేక పోరాటలకు స్పూర్తి: కేసీఆర్   •  

ప్రాణాలు తీసిన అతివేగం

07-11-2024 12:04 AM

రోడ్డు ప్రమాదాల్లో నలుగురి మృతి

కరీంనగర్, నవంబరు 6 (విజయక్రాంతి): అతివేగం నలుగురు యువకుల ప్రాణాలు బలితీసింది. కరీంనగర్ ఎస్సారార్ కళాశాల ముందు మంగళవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో అతివేగంతో వెళ్తున్న బైక్ లారీని ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతిచెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.

మృ తుల్లో ఒకరు కొత్తపల్లికి చెందిన సాయికృష్ణ, మరొకరు కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామానికి చెందిన తాండ్ర శ్రీనివాస్ ఉన్నారు. గాయపడిన యువకుడు జగిత్యాల జిల్లా కథలాపూర్ మండ లం తాండ్రియాలకు చెందిన నాగరాజు.

ఇదే రోజు రాత్రి 10 గంటల సమయంలో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం షానగర్ వద్ద జరి గిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యు వకులు మృతిచెందారు. బైక్‌పై అతివేగంతో వెళ్తున్న యువకులను మినీ వ్యాన్ ఢీకొట్టగా రామడుగు మండల కేంద్రానికి చెందిన నీలం అరుణ్, సామంతుల శశిధర్ మృతిచెందారు.