టెన్త్ ఫలితాల్లో అచీవర్స్ ప్రభంజనం
రాష్ట్రస్థాయిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు
కరీంనగర్, ఏప్రిల్ 30(విజయక్రాంతి): స్థానిక కోతి రాంపూర్‌లోని అచీవర్స్ యాక్టివ్ పాఠశాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు బుధవారం విడుదల చేసిన ఎస్‌ఎస్‌సీ ఫలితాలలో అద్భుత ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయిలో అత్యధిక మార్కులు సాధించి ప్రభంజనం సృష్టించారు. ఈ సంవత్సరం (2025-26)లో 600 మార్కులకు గాను 578, 575 మార్కులు సాధించి వరుసగా 4వ సారి 100% ఉత్తీర్ణత, 39 మంది విద్యార్థులకు గాను 24మంది విద్యార్థులు 500 కంటే ఎక్కువ మార్కులు సాధించారు.
ఈ సందర్భంగా జరిగిన అభినందన కార్యక్రమంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినీ విద్యార్థులను పాఠశాల డైరెక్టర్ సీహెచ్ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాల్ పల్లవి సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సీహెచ్ వెంకటేశ్వర్లు, ప్రిన్సి పాల్ సీహెచ్ పల్లవి, పాఠశాల సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.






