1 May, 2026 | 2:02 AM

టెన్త్ ఫలితాల్లో దక్ష విజయభేరి

01-05-2026 12:00 AM

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 30(విజయక్రాంతి): మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం లోని దక్ష ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉత్తమ మార్కులతో రాణించి 100% ఫలితాలు సాధించారని ఆ పాఠశాల డైరెక్టర్ రంగం ఆంజనేయులు తెలిపారు. కె దీక్షిత 574, షణ్ముఖ ప్రియా 567, ఆర్ ధీరజ్ 565 మార్కులు సాధించగా, మిగిలిన వా రంతా ఉత్తమ ఫలితాలలో సంచలనం సృ ష్టించారని తెలిపారు. ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను పాఠశాల డైరెక్టర్ రంగం ఆంజనేయులుతో పాటు, ప్రిన్సిపాల్ కె కరుణశ్రీ అభినందించారు. ఉత్తమ ఫలితాలను సాధించడానికి కృషిచేసిన ఉపాధ్యాయ బృందానికి అభినందనలు తెలియజేశారు.