2 July, 2026 | 12:25 PM

Breaking News

వృద్ధురాలు దారుణ హత్య..?   •   స్కామ్ నిరూపిస్తే.. ముక్కు నేలకురాసి రాజీనామా చేస్తాం: మంత్రి పొన్నం   •   తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •  

ప్రజలు చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలి

12-06-2025 07:05 PM

గోదావరిఖని పోలీస్ ఆధ్వర్యంలో మెడికల్‌ క్యాంప్‌లో ఏసీపీ రమేష్.. 

గోదావరిఖని (విజయక్రాంతి): ప్రజలు చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించాలని గోదావరిఖనిలో పోలీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెడికల్‌ క్యాంప్‌లో ఏసీపీ రమేష్(ACP Ramesh) అన్నారు. గోదావరిఖనిలోని 13వ డివిజన్ విటల్ నగర్ లో రోహిణి ఫౌండేషన్(Rohini Foundation) వారి సహకారంతో పోలీస్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ ను గురువారం ఏర్పాటు చేయగా క్యాంపుకు గోదావరిఖని ఏసిపి ఎం రమేష్, గోదావరిఖని 1-టౌన్ ఇన్ స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డిలు మెడికల్ క్యాంపు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏసిపి మాట్లాడుతూ... ప్రజలు మెడికల్ క్యాంప్ ను సద్వినియోగం చేసుకోవాలని, ఈ క్యాంప్ లో బిపి, షుగర్, హెచ్ బి, ఓరల్ క్యాన్సర్, డెంటల్ సంబంధిత వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించారు.

పరీక్షలు ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నట్లయితే పెద్దపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ కి రిఫర్ చేయాలని, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని చెడు అలవాట్లకి దూరంగా ఉండాలని, రెగ్యులర్ గా హెల్త్ చెకప్ లు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. రోహిణి ఫౌండేషన్ సహకారంతో నిర్వహించే ఇట్టి ఉచిత మెడికల్ క్యాంపును అందరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని 1-టౌన్ ఇన్ స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐ రమేష్, డాక్టర్లు నిదిన్, అఖిల, ధనుంజయ్, అరుణ్, అఖిల, అసిస్టెంట్ శివ, విఠల్ నగర్ ప్రాంత ప్రజాప్రతినిధులు చుక్కల శ్రీనివాస్, కుకట్ల ఓదెలు, మల్లయ్య, రవి, రామ్ కుమార్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.