18 April, 2026 | 11:12 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

కొత్త గోల్ తండా అంగన్వాడీ కేంద్రంలో అమ్మమాట-అంగన్వాడీ బాట

12-06-2025 07:02 PM

ఐసీడీఎస్ ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లితండ్రులకు అవగాహన..

అనంతగిరి: మండల పరిధిలోని కొత్త గోల్ తండా 1వ అంగన్వాడీ కేంద్రంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ మంగా(ICDS Supervisor Manga) అధ్వర్యంలో బుధవారం అమ్మమాట-అంగన్వాడీ బాట కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీడీపీవో పారిజాతం హాజరై మాట్లాడారు. మూడేండ్ల‌కు పైబడిన చిన్నారులందరినీ అంగన్‌వాడీ కేంద్రాలకు పంపించాలన్నారు.

ఐదు సంవత్సరాలలోపు పిల్లల్లో ఎక్కువగా సమగ్రాభివృద్ధి ఉంటుందని, కావున ప్రాథమిక పాఠశాలకు ముందు పూర్వ ప్రాథమిక విద్యను చిన్నారులకు అందించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఆటపాటలతో కూడిన విద్యా అందించడంతో పిల్లల్లో శారీరక అభివృద్ధితో పాటు మానసిక అభివృద్ధి పెరుగుతుందన్నారు.అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించే కార్యక్రమాల ద్వారా ప్రత్యక్ష అనుభవాల ద్వారా చిన్నారులు నేర్చుకుంటారన్నారు.చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల్లో యూనిఫామ్స్, ఫ్రీస్కూల్ బుక్స్ ఇవ్వడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఉపాధ్యాయులు గంగా,ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపాల్ మొతి లాల్,ఉపాధ్యాయులు శ్రీదేవి,విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.