లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌కు 191 ఎకరాల భూసేకరణ
షాద్‌నగర్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): షాద్ నగర్లో డి విజన్ స్థాయి రెవెన్యూ అధికారుల తో బుధవారం రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహిం చారు. సమావేశం లో ప్రభుత్వం చేపట్టే లక్ష్మీదేవిపల్లి రిజర్వా యర్ (Lakshmi Devipalli Reservoir) నిర్మాణం కోసం ప్రభుత్వ నిబంధనల ప్రకారం 191 ఎ కరాల భూమి సేకరణ పూర్తయిందన్నారు. జిల్లాలోని 611 గ్రా మపంచాయతీల్లో విడతలవారీగా రీ-సర్వే చేపడతామని, మొదటి విడత కింద 108 పంచాయతీలకు నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు.
షాద్ నగర్ పరిధిలో ఎంపిక చేసిన గ్రా మాలు తూంపల్లి (జిల్లేడు చౌదరిగూడ), సూర్యారావు గూడ (ఫరూక్ నగర్), చింతకుంటపల్లి (కేశంపేట) మండలం కు 281 మంది లైసెనస్డ్ సర్వేయర్లను నియమించినట్లు అడిషనల్ కలెక్టర్ పేర్కొన్నారు. ఒక్కో సర్వేయర్ నెలకు 500 ఎకరాల వరకు సర్వే చేస్తారు. ఎకరాకు రూ.60 చొప్పున ప్రభుత్వం చెల్లి స్తుందని చేప్పారు. 22A భూముల వివరాలపై రివ్యూ చేసి నివే దిక అందిస్తారు.
కోర్టు వివాదాల్లో ఉన్న భూములను 22A లో పెట్టలేదని సమస్యల కోసం రైతులు నేరుగా అధికారులనే సంప్రదించాలని దళారులను ఆశ్రయించకూడదు. అసైన్డ్ భూ ములను అక్రమంగా కొనుగోలు చేస్తే బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రేడియల్ రోడ్డు బాధితులకు నష్టపరిహారం దాదాపు పూర్తయింది (కేవలం 5 ఎకరాలు మాత్రమే పెండింగ్). త్వరలోనే స్మార్ట్ రేషన్ కార్డులు ఇస్తాం, ఖాళీ రేషన్ డీలర్ పోస్టులను భర్తీ చేస్తాం అని అధికారుల సమీక్ష అనంతరం ఆయన పేర్కొన్నారు






