కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్ నిరసన
సూర్యాపేట నెట్ వర్క్, సెప్టెంబర్ 2: కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వైఫల్య పాలనపై సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా బీఆర్‌ఎస్ నాయకులు బుధవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలుచోట్ల పెద్ద ఎత్తున ఫ్లెక్సీలతో ర్యాలీలు తీసి నిరసనలు తెలిపారు.
ముఖ్యంగా జిల్లా కేంద్రంలో మాజీ మంత్రివర్యులు, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి(MLA Guntakandla Jagadish Reddy) ఆదేశాలతో రేవంత్ ఇచ్చిన మోసపూరిత హామీలతో రూపొందించిన 420 మీటర్ల ఫ్లెక్సీతో వినూత్న రీతిలో ర్యాలీ తీశారు. జిల్లా కేంద్రంలోనీ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ శంకర్ విలాస్ సెంటర్ మీదుగా రాఘవ ప్లాజా, పీఎస్‌ఆర్ సెంటర్, పూల సెంటర్ మీదుగా, గాంధీ చౌరస్తా వరకు ర్యాలీ తీశారు.
ఈ కార్యక్రమంలో బడుగుల లింగయ్య యాదవ్, వై.వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణ,వెంకటనారాయణ, నిమ్మల శ్రీనివాసు, సత్తిరెడ్డి, కోదాడలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, తుంగతుర్తిలో మాజీ ఎమ్మెల్యే గాదారి కిషోర్ కుమార్, మాజీ జెడ్పీ చైర్ పర్సన్ గుజ్జా దీపికా యుగంధర్ రావు, హుజూర్ నగర్ లో బీఆర్ ఎస్ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఒంటెద్దు నరసింహారెడ్డి, మాజీ జెడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి, వెంకటరెడ్డి, జక్కుల నాగేశ్వరరావు, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.






