calender_icon.png 5 August, 2025 | 4:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి నుండి పాలిటెక్నిక్ డిప్లమో కోర్సుల దరఖాస్తుల స్వీకరణ

05-08-2025 12:24:55 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్(Polytechnic Diploma Courses) కళాశాలలో 2025 స్పాట్ డిప్లమో కోర్సులలో మంగళవారం నుండి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైనట్లు బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మారం దేవేందర్ తెలిపారు. పదవ తరగతి పూర్తి చేసిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఈనెల 5 నుండి 7 వరకు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఈనెల 8 స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, మైనింగ్ ఇంజనీరింగ్ విభాగాలలో మొత్తం 50 సీట్లు ఖాళీ ఉన్నట్లు తెలిపారు. దరఖాస్తులను బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉదయం 9:30 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు స్వీకరించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ మారం దేవేందర్ తెలిపారు.