మైనర్ అమ్మాయిల జోలికి వెళితే.. జైలుకే: సీఐ వెంకట్ రెడ్డి
సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ పోలీస్ స్టేషన్ లో మంగళవారం సీఐ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ... ఈ మధ్య యువత చిన్న పెద్ద తేడా లేకుండా మైనర్ అమ్మాయిల జోలికి వెళ్ళడం, మాయ మాటలు చెప్పి వెంట పడటం, తీసుకెళ్లడం చేస్తున్నారు. ఎవరైనా మైనర్ అమ్మాయి జోలికి వెళ్లిన, తీసుకెళ్లినా, తీసుకెళ్లేందకు అతనికి ఎవరైనా సహకరించినా పోక్సో చట్టం 14 సం"(లేదా) యావజ్జీవ శిక్ష పడుతుందని యువత ఇలాంటి జోలికి వెళ్లి వారి భవిష్యత్ నాశనం చేసుకోవద్దని సీఐ వెంకట్ రెడ్డి కోరారు. అలాగే తల్లి దండ్రులు మైనర్ పిల్లలపై ఒక కన్నేసి ఉంచాలి వాళ్లు ఏమి చేస్తున్నారని, ముఖ్యంగా ఫోన్స్ విషయంలో, ఛాటింగ్ విషయంలో గానీ పిల్లలపై నిఘా ఉంచాలి లేకుంటే చెడు వ్యసనాలకు బానిసై పక్క దారి పట్టి భవిష్యత్ నాశనం చేసుకుంటారని తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సీఐ వెంకట్ రెడ్డి హెచ్చరించారు.






