05-08-2025 12:09:10 PM
హైదరాబాద్: గత మూడు రోజులుగా నగరంలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, పలు రోడ్లు మెత్తబడ్డాయి. మహేశ్వరిఛాంబర్స్ సమీపంలోని బంజారాహిల్స్(Banjara Hills) లోని రోడ్డు నెంబర్1/12లో రోడ్డు కుంగింది. రోడ్డు కుంగడంతో 10,000 లీటర్ల నీటి ట్యాంకర్ అకస్మాత్తుగా గుంతలో పడిపోయింది. విరించి హాస్పిటల్ బంజారాహిల్స్ సమీపంలోని కేవ్స్-ఇన్ రోడ్డు వెంబడి ఉన్న డ్రైనేజీపై భాగం కాంక్రీట్ కూలడంతో నీటి ట్యాంకర్ కాలువలో పడిపోయింది. బహుశా నిన్న కురిసిన భారీ వర్షాల కారణంగా ట్యాంకర్ బరువును మోయలేకపోవడం వల్ల అది బలహీనంగా ఉండవచ్చని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని, ప్రస్తుతం నీటి ట్యాంకర్ ను బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టామని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనను చూసిన స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.