05-08-2025 11:52:43 AM
హైదరాబాద్: ఇనగంటి వెంకట్రావు రాసిన 'విలీనం-విభజన' పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమాన్ని హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో మంగళవారం నిర్వహించారు. పుస్తకావిష్కరణకు మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు(Muppavarapu Venkaiah Naidu), తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి(Telangana Media Academy Chairman Srinivas Reddy) హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ... పత్రికలు సమాజానికి దర్పణం లాంటివన్నారు. సమాజంలోని అవినీతిని ప్రజలకు జర్నలిస్టులు వివరించాలని వెంకయ్య సూచించారు. నిజాన్ని తెలియజేసి తీర్పు ఇవ్వటాన్ని ప్రజలకే వదిలేయాలని తెలిపారు. మాట్లాడే భాష హుందాగా మాట్లాడాలి.. గతంలో బూతులు మాట్లాడే నేతలు ఎవరూ గెలవలేదని వెంకయ్య స్పష్టం చేశారు. బూతులు మాట్లాడే వారిని నిలువరించాలని ఓ మహిళ తనతో అన్నారని ఆయన వివరించారు. పోలింగ్ బూత్ ల ద్వారా బూతు నేతల నోరు మూయించాలని చెప్పిన విషయాన్ని వెంకయ్య నాయుడు(Venkaiah Naidu) గుర్తుచేశారు.