19 March, 2026 | 9:10 PM

యూఎస్‌లో యాక్షన్

30-10-2024 12:00 AM

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబో అంటే అభిమానులకు పండగే. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే కొన్ని సినిమాలు వచ్చాయి. వీరిద్దరి కొలాబరేషన్‌లో వచ్చిన ‘అఖండ’ మంచి విజయం సాధించింది. దీం తో ‘అఖండ 2’కూ కొబ్బరికాయ కొట్టేశారు. దీనికి సంబంధించి తాజాగా ఓ అప్‌డేట్ వచ్చింది. అదేంటంటే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఎక్కడ? ఏ సన్నివేశంతో ప్రారంభిస్తారనే విషయమై క్లారిటీ వచ్చేసింది.

అమెరికాలో ఓ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించేందుకు బోయపాటి ప్లాన్ చేస్తున్నారట. ఈ సన్నివేశం చిత్రీకరణతోనే సినిమా షూటింగ్ కూడా ప్రారంభమవుతుందట. ఈ చిత్రంలో బాలయ్య రైతు, అఘోర పాత్రల్లో కనిపించనున్నారు. ప్రగ్యా జైస్వాల్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రమాదంలో పడిన ప్రగ్యాను బాలయ్య రెస్క్యూ చేసి కాపాడుతారట.

ఈ సన్నివేశం అద్భుతంగా ఉంటుందని తెలుస్తోంది. త్వరలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. పాన్ ఇండియా చిత్రంగా ఇది తెరకెక్కనుంది. రామ్ ఆచంట, గోపి ఆచంటలతో కలిసి బాలకృష్ణ కూతురు తేజస్విని ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

ఇప్పటికే బోయపాటి చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేశారు. అఖండలో బాలయ్య ఇంట్రడక్షన్ సన్నివేశం వచ్చేసి వ్యవసాయ భూమి, ఎద్దుల బ్యాక్ డ్రాప్‌తో జరిగే యాక్షన్ సన్నివేశంతో ప్రారంభమవుతుంది. అఖండ 2లో మాత్రం బాలయ్యను బోయపాటి స్టులిష్ అవతార్‌లో పరిచయం చేయనున్నారట.