విమాన ప్రమాదంలో మరణించానని చెప్పాడు..
బాలీవుడ్ నటి కాజోల్ కీలక పాత్రలో నటించిన ‘దో పత్తి’ చిత్రం ఇటీవల ఓటీటీలో విడుదలైంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇంకా ప్రమోషన్ కార్యక్రమాలను చిత్రబృం దం నిర్వహిస్తూనే ఉంది. తాజాగా ఓ షోలో కాజోల్ సందడి చేశారు. ఈ షోలో ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తను చనిపోయినట్టు చాలా సార్లు వార్తలు వచ్చాయని కాజోల్ చెప్పుకొచ్చారు.
మీ గురించి ఏమైనా వింత వార్తలు మీరు చదివారా? అని కాజోల్‌ను ప్రశ్నించగా.. “చాలా ఉన్నాయి. నేను చనిపోయినట్టు చాలా సార్లు వార్తలు రావడంతో వాటిని చూసి షాకయ్యాను. దాదాపు ఐదేళ్లకోసారి ఇలాంటి వార్తలు వస్తూనే ఉంటాయి. ఇంటర్నెట్ లేని సమయంలో ఓ వ్యక్తి మా అమ్మకు ఫోన్ చేసి నేను విమాన ప్రమాదంలో మరణించానని చెప్పాడు. దీంతో ఇంట్లోవాళ్లు కంగారుపడ్డారు.
నా గురించి ఏవైనా వార్తలు వచ్చాయా? వాటిపై ఎవరెలా స్పందిస్తున్నారని నేను ఇంటర్నెట్‌లో వెదకను. నాపై ఏవైనా సంచలన కథనాలు వస్తే వాటిని స్నేహితులు నాకు పంపిస్తారు. వాటిని చదివినప్పుడు ఇలా ఎలా రాస్తారని ఆశ్చర్యపోతుంటా” అని కాజోల్ తెలిపారు.
‘దోపత్తి’ చిత్రంలో కృతి సనన్ ప్రధాన పాత్రలో నటించగా.. పోలీస్ అధికారి పాత్రలో కాజోల్ నటించారు. మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రానికి శశాంక్ చతుర్వేది దర్శకత్వం వహించారు.




