లొకేషన్ వేటలో..
మహేశ్ బాబు కథానాయకుడిగా ఎస్‌ఎస్ రాజమౌళి దర్శ కత్వంలో యాక్షన్ అడ్వెంచర్ మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఎప్పుడు మొదలవుతుందా? అని మహేశ్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ రాజమౌళి అంత త్వరగా ప్రారంభిస్తారా? ప్రతి ఒక్క విషయంలోనూ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు.
ప్రస్తుతం లొకేషన్స్ వెతికే పనిలో ఉన్నారని తాజాగా రాజమౌళి నెట్టింట షేర్ చేసిన ఫోటోను బట్టి తెలుస్తోంది. ఎస్‌ఎస్‌ఎంబీ 29గా ఈ చిత్రం రూపొందనుంది. ఒక ప్రాంతంలో ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళుతున్న ఫోటోను రాజమౌళి షేర్ చేశారు. ఆ ఫోటోకు ‘కనుగొనడం కోసం తిరుగుతున్నా’ అనే క్యాప్షన్ ఇచ్చారు.
దీంతో లొకేషన్ వేట మొదలైందంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా రాజమౌళి గ్రాఫిక్స్‌ను బాగా వినియోగిస్తారు. ఈ సినిమాలో ఏఐని వినియోగించనున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్‌పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే కథను సినిమాగా రాజమౌళి తెరకెక్కించనున్నారు.




