23 May, 2026 | 1:50 AM

కుల వివక్షపై చర్యలు తీసుకోవాలి

23-05-2026 12:51 AM

గజ్వేల్, మే 22: గజ్వేల్ నియోజకవర్గంలోని గ్రామాల్లో కుల వివక్షత కొనసాగుతుందని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పుల్లూరు ఉమేష్ అన్నారు. శుక్రవారం బహుజన్  సమాజ్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ కమిటీ అధ్యక్షుడు కొమ్ము చంద్ర ఆధ్వర్యంలో గజ్వేల్ ఆర్డీవో చంద్రకళ వినతిపత్రం అందించిన ఉమేష్ మాట్లాడారు.

జగదేవపూర్  మండలంలోని గ్రామాల్లో కుల బహిష్కరణ చేస్తూ, వారి పైన దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఇలాంటివి జరగకుండా ‘సివిల్ రైట్స్ డే‘ పకడ్బందీగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.  వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నెలల తరబడి ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దనే రైతులు ఉండాల్సి వస్తుందన్నారు. రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.

లారీలు సమస్యను కూడా తెలిపారు. తక్షణమే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సానుకూలంగా స్పందించిన ఆర్డీవో వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొండనోళ్ల నరేష్, అసెంబ్లీ ఇంచార్జ్ మొండి కరుణాకర్, అసెంబ్లీ ఉపాధ్యక్షులు బయ్యారం శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి కనక ప్రసాద్, శరదని రాము, కర్రోళ్ల నవీన్ తదితరులు పాల్గొన్నారు.