2 July, 2026 | 3:59 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి

02-07-2026 03:26 PM

ఆసిఫాబాద్(విజయ క్రాంతి):జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఆత్మకూరి చిరంజీవి మాట్లాడుతూ ఆసుపత్రిలో వైద్యుల విధుల నిర్లక్ష్యం, నకిలీ హాజరు నమోదు, పర్యవేక్షణ లోపాలపై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.విధులకు హాజరు కాకుండానే హాజరు నమోదు చేసిన వైద్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, బయోమెట్రిక్ హాజరు విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో బోయిరే ప్రకాష్, పిడుగు శంకర్, కొదురుపాక మహేష్, వర్కోల్ రాకేష్, పిప్పిరి వెంకటేష్, శ్రీరామ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.