ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి
బోథ్ జూలై 2 (విజయ క్రాంతి): ప్రతి విద్యార్థి ఆరోగ్యం పైన శ్రద్ధ చూపించాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఎమ్మెల్యే జాదవ్ అనిల్ కోరారు. గురువారం బజారత్నం మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో ఆరోగ్య పాఠశాల కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు పోషకాహారం తీసుకోవాలని కోరారు ఆరోగ్యం పైన అవగాహన పెంచుకోవాలని అందుకే ఆరోగ్య పాఠశాల కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించడం జరిగిందన్నారు ఈ సందర్భంగా ఇలాంటి డ్రగ్స్ పోస్టర్లను ఆవిష్కరించారు ఆరోగ్యం ఉంటుందని సమతుల్య ఆహారం ఆరోగ్యానికి మంచిదన్నారు మానసికంగా శారీరకంగా బాగుంటే విద్యార్థులు చదువుల్లో ముందు ఉంటారన్నారు కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నరసయ్య తోపాటు పాఠశాల ప్రిన్సిపాల్ లు పాల్గొన్నారు ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు చేసిన నృత్యాలు ఆలరించాయి. కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు






