2 July, 2026 | 3:56 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు

02-07-2026 03:22 PM

చేర్యాల, జూలై 02:  చేర్యాల మండలంలో సబ్సిడీ యూరియా పక్కదారి పట్టిన ఘటన కలకలం రేపింది.శ్రీ సాయి శివ ఫర్టిలైజర్స్ డీలర్ చేతిరెడ్డి సందీప్ రెడ్డి 6,429 బస్తాల యూరియాను ఈ-పోస్ లో నమోదు చేయకుండా,కేవలం కాగితాలకే పరిమితం చేసి రూ.17.10 లక్షల ప్రభుత్వ సబ్సిడీని దారి మళ్లించినట్లు ఏడీఏ టి.రాధిక ఫిర్యాదు మేరకు చేర్యాల పోలీసులు కేసు నమోదు చేసి,నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని ఈ వ్యవహారంలో మరికొన్ని ఫెర్టిలైజర్  దుకాణాల పాత్రపై దర్యాప్తు చేపట్టినట్టు చేర్యాల సిఐ రమేష్ నాయక్ తెలిపారు.

ఈ అక్రమాలపై సిద్ధిపేట జిల్లా కలెక్టర్ హైమావతి సీరియస్ అయ్యారు.విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన మండల వ్యవసాయాధికారి భోగేశ్వర్ స్వామిని సస్పెండ్ చేస్తూ,నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన సాయి శివ ఫర్టిలైజర్ దుకాణం లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.రైతులకు అందాల్సిన సబ్సిడీ ఎరువులను అక్రమంగా తరలించిన విక్రాయించిన కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.ప్రభుత్వ పథకాలను పక్కదారి పట్టిస్తున్న వారిపై వ్యవసాయ శాఖ అధికారులు నిఘా పెంచారు.