2 July, 2026 | 3:50 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

02-07-2026 03:19 PM

కల్వకుర్తి, జూలై 2: కల్వకుర్తి పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించిన పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సిబ్బందినీ ఆదేశించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు ప్రశాంతమైన వాతావరణం కల్పిస్తూ, వారి ఫిర్యాదులపై వెంటనే స్పందించి పారదర్శక విచారణ ద్వారా సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. డయల్-112 ద్వారా వచ్చే అత్యవసర కాల్స్‌పై వెంటనే స్పందించి బాధితులకు సకాలంలో సహాయం అందించాలని బ్లూ కోల్ట్ సిబ్బందికి ఆదేశించారు. రౌడీషీటర్ల వివరాలను సమీక్షించి, వారి కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు.

గ్రామ స్థాయిలో పనిచేసే విలేజ్ పోలీస్ ఆఫీసర్లు తమ పరిధిలో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎస్పీ పిలుపునిచ్చారు. పోలీస్ స్టేషన్‌లోని రిసెప్షన్, సైబర్ క్రైమ్ వారియర్, సీసీటీవీ ఇన్‌చార్జ్‌తో పాటు ఇతర సిబ్బంది పనితీరును సమీక్షించి విధి నిర్వహణకు సంబంధించి పలు సూచనలు చేశారు. స్టేషన్‌లో పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను తెలుసుకున్న ఎస్పీ, ఎలాంటి కేసులు పెండింగ్‌లో లేకుండా వేగంగా విచారణ పూర్తి చేసి చర్యలు తీసుకోవాలని ఎస్సై కురుమూర్తిని ఆదేశించారు. ఎస్పి వెంట డిఎస్పి వెంకట్ రెడ్డి ఉన్నారు.