ప్రైవేట్ పాఠశాలల అధిక ఫీజులపై చర్యలు తీసుకోవాలి
ఎంఈఓకు ఏబీవీపీ వినతి
షాద్నగర్, జూన్ 10(విజయక్రాంతి): ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో అడ్డగోలు ఫీజుల వసూళ్లను అరికట్టాలని మరియు నిబంధనలు ఉల్లంఘిస్తున్న విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు ఫరూక్ నగర్ ఎంఈఓకు వినతిపత్రం అందజేశారు.షాద్నగర్ పరిధిలోని ప్రైవేట్ పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తూ, పుస్తకాలు, యూనిఫారాలను నిర్దిష్ట దుకాణాల్లోనే కొనాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నాయని ఏబీవీపీ ఆరోపించారు.సరైన అనుమతులు, మౌలిక వసతులు లేని విద్యాసంస్థలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి,చట్టపరమైన చర్యలు మరియు జరిమానాలు విధించాలని డిమాండ్ చేశారు.
ప్రత్యేక తరగతుల పేరుతో విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురిచేయడాన్ని నిరసిస్తూ, ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ పవన్ కళ్యాణ్తో పాటు విద్యార్థి నాయకులు విజయ్, కోమల్, అభి, సందీప్ తదితరులు పాల్గొన్నారు.






