11 June, 2026 | 1:21 AM

ఫర్టిలైజర్ యాప్‌తో ఎరువుల విక్రయాలు

11-06-2026 12:00 AM

ఆమనగల్లు, జూన్10, (విజయక్రాంతి): రైతులందరికీ పారదర్శకంగా ఎరువుల పంపిణీ చేసేందుకు ప్రభుత్వము ప్రత్యేకంగా యాప్ ను చేపట్టిందని మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. బుధవారం ఆమనగల్లు మండలంలో ఫర్టిలైజర్ యాప్ ద్వారా ఎరువుల కొనుగోలు ఆయన విధానాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు కింద సెలెక్ట్ చేయబడిన రంగా రెడ్డి జిల్లా లో ఫర్టిలైజర్ యాప్ ద్వారానే ఎరువులు కొనుగోలు చేయాలి.దీనికి ముఖ్యంగా రైతులు ఫార్మర్  రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకొని వాళ్ళు, ఫర్టిలైజర్ యాప్ గురించి మీ వ్యవసాయ విస్తరణాధికారిని లేదా మీ సమీప ఆధార్ కేంద్రాన్ని సందర్శించి ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించు కోవాలని ఆయన కోరారు.